11 September 2025
నా స్థానాన్ని ఎవరో లాక్కుంటారని భయపడ్డాను.. సమంత..
Rajitha Chanti
Pic credit - Instagram
ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్. వరుస సినిమాలు, వరుస హిట్లు, టాప్ జాబితాలో స్థానంతో దూసుకుపోయింది సమంత.
కెరీర్ మొదట్లో సహజ నటనతో కట్టిపడేసింది. తక్కువ సమయంలోనే వరుస హిట్లతో స్టార్ స్టేటస్ సంపాదించుకుంది ఈ బ్యూటీ.
అయితే తన స్థానాన్ని ఎవరైనా లాక్కుంటారేమో అనే భయంతో.. తన ఆత్మగౌరవాన్ని పూర్తిగా నంబర్లతోనే ముడిపెట్టి చూశానని తెలిపింది.
నిర్మాతగా మా బంగారు తల్లి సినిమాతో అడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది.
గతంలో తన ఆలోచనా విధానం గురించి వివరిస్తూ గ్యాప్ లేకుండా సినిమాలు చేయడమే సక్సెస్ అని బలంగా నమ్మిందట సమంత.
ఏడాదికి ఐదు సినిమాలు విడుదలైన రోజులు ఉన్నాయని.. ఎప్పుడూ టాప్ నటీనటుల జాబితాలో ఉండాలని నిత్యం అనుకునేదట.
భారీ బ్లక్ బస్టర్స్ అందుకోవాలని లెక్కలు వేసుకునేదట. ఆ ఇంటర్వ్యూలో తన కెరీర్ రోజులను, పర్సనల్ విషయాలు పంచుకుంది సమంత
ఇప్పుడు తన ఆలోచనల్లో పూర్తి మార్పు వచ్చిందని అన్నారు. గత రెండేళ్లుగా ఒక్కసినిమా చేయలేదు. టాప్ 10 జాబితాలోనూ లేదని తెలిపింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్