న్యూ జర్నీ మొదలుపెట్టిన సమంత

11 December 2023

నటిగా సినీ ప్రేక్షకులను మెప్పించిన సమంత ఇప్పుడు న్యూ జర్నీ మొదలుపెట్టారు. సినీ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసినట్లు ఆమె స్వయంగా ప్రకటించారు.

తన ప్రొడక్షన్ హౌస్‌కి ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ అని పేరు పెట్టినట్లు సోషల్ మీడియా వేదికగా సమంత వెల్లడించారు.

తనకు ఇష్టమైన హాలీవుడ్ సాంగ్ బ్రౌన్ గర్ల్ ఈజ్ ఇన్ ది రింగ్ నౌ లిరిక్స్ స్ఫూర్తితో తన ప్రొడక్షన్ హౌస్‌కి ఈ పేరు పెట్టినట్టు తెలిపారు.

ఇండస్ట్రీలో న్యూ ట్యాలెంట్‌ను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ ప్రొడక్షన్ హౌస్ నెలకొల్పినట్టు సమంత తెలిపారు.

వాస్తవికతకు దగ్గరగా ఉండే అర్థవంతమైన, యూవనిర్సల్ స్టోరీలు చెప్పగలిగే డైరెక్టర్లకు తన ప్రొడక్షన్ హౌస్ వేదికగా నిలుస్తుందని తెలిపారు.

ప్రస్తుతం సినీ షూటింగ్స్‌కు కాస్త విరామం ఇచ్చిన సమంత.. ఇకపై ప్రొడక్షన్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టబోతున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన సమంతకు సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ తారలు విషెస్ తెలిపారు.

కొత్త ప్రయాణంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు అంతా మంచే జరగాలని మనం కూడా ఆమెకు విషెస్ చెప్పేద్దాం..