15 February 2024

ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చే పనిలో  బిజీగా ఉన్న సామ్

TV9 Telugu

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండియా మొత్తం ఈ ముద్దుగుమ్మకు అభిమానులు ఉన్నారు.

బడా హీరోల సరసన నటించి తన కంటూ ఒక సొంతంగా ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. గట్టి ఫ్యాన్ ఫాలోయింగే సొంతం చేసుకుంది.

అయితే ఆమెను అభిమానించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉండగా సమంత కూడా తన గురించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. 

తాజాగా సమంత తన బాల్యాన్ని గుర్తుచేసుకుంటూ ఇంట్రెస్టింగ్ గా ఓ విషయాన్ని తన అభిమానులతో పంచుకోగా అది నెట్టింట ట్రెండ్ అవుతుంది.

తన చిన్నప్పుడు అకాడమిక్ సెలబస్ కు సంబంధించిన పుస్తకాల కంటే... ఇతర పుస్తకాలనే ఎక్కువగా చదివేదంట సామ్.

అయితే మళ్లీ ఇప్పుడు అదే పనిలో ఉన్నట్టు చెప్పుకొచ్చింది సామ్. ఈ సందర్భంగా దానికి ఇంట్రెస్టింగ్ గా క్యాప్షన్ ఇచ్చింది.

 ‘నేను చిన్నప్పుడు మా సిలబస్‌కి మించిన పుస్తకాలు చదువుతాను. ఏ సబ్జెక్ట్‌లో అయినా పరిశోధన చేయడం, లీనమవడం నాకు చాలా ఇష్టం.

ఇప్పుడు, నేను మళ్లీ చదువుతున్నాను..  చాలా సంవత్సరాల తర్వాత నా మనసు ఉప్పొంగుతోంది..  నా నోట్‌బుక్‌లు నిండాయి.. త్వరలోనే మీతో పంచుకుంటాను.’ అంటూ రాసుకొచ్చింది.