TV9 Telugu

06 March 2024

అప్పుడే అయిపోయింది అనుకోకండి.. ఇప్పుడే మొదలైంది అంటున్న సామ్.

కష్టాలు సమంతని వెంటాడుతూనే ఉన్నాయి. మయోసైటిస్ వచ్చింది, ఇండస్ట్రీ నుంచి మాయమైపోతుంది.! డివోర్స్ తీసుకుంది.

డిప్రెషన్‌తో కెరీర్ పాడు చేసుకుంటుంది..! ఫ్లాప్స్ వస్తున్నాయి.. ఆఫర్స్‌ దూరమైపోతాయ్ అనుకుంటున్నారా..?

అదే స్పీడ్., అదే జోరు అంటున్నారు స్యామ్. రేసులోకి వస్తే నాతో నిలబడేదెవరు.. నన్ను ఢీ కొట్టేదెవరు అంటూ సవాల్ చేస్తున్నారు సమంత.

తాజాగా బికినీ ఫోటోషూట్‌తో అందరి మతులు చెడగొట్టే ప్రోగ్రామ్ పెట్టుకున్నారు స్యామ్. సమంత స్పీడ్ కు నో బ్రేక్స్.

టాలీవుడ్ టూ బాలీవుడ్ సమంతతో నటించడానికి హీరోలు పోటీ పడుతున్నారు. ఈ మధ్యే ఈ భామకు హాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది.

దాంతో అక్కడ కూడా జెండా పాతాలని చూస్తున్నారు ఈ భామ. విడాకుల తర్వాత కాస్త జోరు తగ్గించినట్లు అనిపించినా..

తగ్గేదే లే అంటూ హాలీవుడ్ వరకు స్యామ్ జర్నీ సాగుతూ ఉంది.ఖుషీ తర్వాత తెలుగు సినిమాలేవీ ఒప్పుకోలేదు ఈ భామ. 

బాలీవుడ్‌లో మాత్రం సమంత ఫుల్ బిజీ. చెన్నై స్టోరీ అనే హాలీవుడ్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినా డేట్స్ కుదరక వదిలేసారు సమంత.