12 October 2025
రోజూ ఒకే రకమైన ఆహారం.. సమంత చెప్పిన డైట్ ప్లాన్.. ఏం చేస్తుందంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
చాలా కాలం తర్వాత సమంత తిరిగి సినిమాల్లో యాక్టివ్ అయ్యింది. ఇటీవలే శుభం సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చి నిర్మాతగానూ సక్సెస్ అయ్యింది.
ఇప్పుడిప్పుడే కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అలాగే ఇప్పుడు సమంత పూర్తిగా సన్నబడి.. మరింత స్టైలీష్ గా కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తుంది.
ఇటీవల ఆమె తన పాడ్ కాస్ట్ లో డైట్ ప్లాన్ రివీల్ చేసింది. ఈరోజు రోజూ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ పాటించడం తన ఆరోగ్యానికి మంచిదని చెప్పుకొచ్చింది.
యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అనేది.. శరీరంలో మంటను తగ్గించడానికి.. అలాగే ప్రాసెస్ చేయని.. పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం పై ఉంటుదట.
సమంత తన ఆహారంలో ఎక్కువగా తాజా కూరగాయలు, మొలకలు, బ్రోకలీ ఉండేలా చూసుకుంటుంది. పాలకూర, అకాయ్ బెర్రీలు, పసుపు, నెయ్యి తీసుకుంటుంది.
రోజూ ఒకేరకమైన భోజనం తీసుకుంటుందట. అలాగే అధికంగా ప్రోటీన్, ఫైబర్ ఉండే ఆహారాలను తీసుకుంటుంది. కొబ్బరి నీరు హైడ్రేట్ గా ఉంచుతుంది.
జంక్ ఫుడ్ అస్సలు తీసుకోదట. చిరు ధాన్యాలతోపాటు బ్రేక్ ఫాస్ట్ ఎప్పుడూ స్కిప్ చేయదట. అలాగే రోజూ కఠినమైన వర్కవుట్స్, యోగా చేస్తుందట.
తాను తీసుకునే ఆహారం ప్రతిరోజూ ఒకేలా ఉంటుందని.. అందుకే ఆహారం విషయంపై ఎక్కువగా ఆలోచించనని గతంలో చెప్పుకొచ్చింది సమంత.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్