సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ ఉన్న సమంత.. ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో విజయ్ దళపతిస్ సినిమాలో హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యారనే టాక్ కూడా వచ్చేలా చేసుకున్నారు.
ఇక అసలు విషయం ఏంటంటే..! తాజాగా సమంత ఓ కాలేజ్ ఈవెంట్ కు హాజరయ్యింది. అక్కడ స్టూడెంట్స్ తో సందడి చేసింది.
ఈ క్రమంలోనే తనకు సినిమాల్లో రోల్ మోడల్ అల్లు అర్జున్ అని చెప్పింది సామ్. పేరు చెప్పగానే స్టూడెంట్స్ కేకలతో ఆ ఏరియాను అదిరిపోయేలా చేశారు.
అంతేకాదు అల్లు అర్జున్ తన సినీ కెరీర్ లో రోల్ మోడల్ అని చెప్పింది సామ్. తను ఇప్పుడు ఓ యాక్టింగ్ బీస్ట్ గా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాడని కూడా చెప్పుకొచ్చింది.
అయితే సమంత అల్లు అర్జున్ ను ఈ రేంజ్‌లో పొగడడం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది.
దాంతో పాటే అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు ఖుషీ ఇస్తోంది. ఇక సమంత అల్లు అర్జున్ కలిసి సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా చేశారు.
అలాగే పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ కు అల్లు అర్జున తో మైండ్ బ్లోయింగ్ స్టెప్స్ వేసి అందరిని మెప్పించింది సామ్.