ఆ ఇద్దరిని బతిమాలుకున్నా..కానీ: సమంత

17 October 2024

Basha Shek

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల సినీ పరిశ్రమలో పెద్దగా యాక్టివ్‌గా కనిపించడం లేదు. అనారోగ్యానికి గురికావడంతో నటనకు విరామం ఇచ్చారు.  

అయితే ఇప్పుడు ఆమె  దృష్టి సినిమాల కంటే వెబ్ సిరీస్‌లపైనే ఎక్కువగా ఉంది. సామ్ నటించిన లేటెస్ట్ సిరీస్ హనీ బన్నీ సిటాడెల్.

ఈ సిరీస్‌కి రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. నటి కావాలని కలలు కనే యువతి పాత్రలో సమంత నటిస్తున్నట్లు సమాచారం

ఇటీవల ఈ హనీ బన్నీ  వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ‍ప్రమోషన్లతో బిజీగా ఉన్న సమంత తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

మయోసైటిస్ కారణంగా నాతో ఈ వెబ్ సిరీస్ చేయొద్దని టీమ్‌కి చెప్పాను. ఈ పాత్ర చేయడం నాకు అసాధ్యం అనుకున్నాను'

'అందుకు నా స్థానంలో నలుగురి హీరోయిన్ల పేర్లు, నటీనటుల పేర్లు చెప్పాను. కానీ వారు అందుకు అంగీకరించలేదు' అని సమంత తెలిపింది.

కాగా ఇంతకు ముందు ది ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్‌లో అద్భుతంగా నటించింది. ఆమె  పాత్ర పలువురి ప్రశంసలు అందుకుంది.