TV9 Telugu

చైతూతో విడాకులపై సమంత కామెంట్స్‌.. ఇన్‌ డైరెక్టుగా..

20 Febraury 2024

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, యువ సామ్రాట్‌ అక్కినేని  నాగచైతన్యలు విడిపోయి సుమారు మూడేళ్లు కావొస్తోంది.

2017లో పెద్దల ఆశీర్వాదంతో ప్రేమ వివాహం చేసుకున్న సామ్, చైతన్య 2021లో విడిపోయినట్లు ప్రకటించి షాకిచ్చారు.

విడాకుల తర్వాత ఎవరి ప్రొఫెషనల్ పనుల్లో వారు బిజీగా మారిపోయారు. పర్సనల్ లైఫ్ పై ఎలాంటి కామెంట్స్ చేయట్లేదు.

అయితే సమంత మాత్రం డైరెక్టుగా కాపోయినా అప్పుడప్పుడు నాగచైతన్యతో విడాకుల గురించి మాట్లాడుతూ వుంటుంది.

తాజాగా మరోసారి ఇదే విషయంపై స్పందించింది సామ్.మయోసైటిస్‌కు సరిగ్గా ఏడాది ముందు నాటి పరిస్థితిని గుర్తుకు తెచ్చుకుంది.

మయోసైటిస్‌ సమస్య రావడానికి సరిగ్గా ఏడాది ముందు సమంత.. నాగ చైతన్యతో విడాకులు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ సమయం తనకు ఎంతో కష్టంగా గడిచిందని సామ్ తెలిపింది. దీంతో విడాకులను ఉద్దేశించే సామ్‌ పరోక్షంగా చెప్పుకొచ్చినట్లుంది.

ఖుషి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సమంత త్వరలోనే సిటాడెబ్ వెబ్ సిరీస్ తో అలరించేందుకు సిద్ధమవుతోంది.