17 March 2024
సింపతి క్వీన్ బిరుదుపై సమంత రియాక్షన్.. ట్రోల్స్ పై ఏమన్నదంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
ప్రస్తుతం సమంత సినిమాలకు దూరంగా ఉంటుంది. కొన్నాళ్లుగా ఆమె మయోసైటిస్ సమస్యకు ఇమ్యూనిటీ ట్రీట్మెంట్ తీసుకుంటూ విశ్రాంతి తీసుకుంటుంది.
ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సామ్ సినిమాలు, హెల్త్, పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. అలాగే సింపతి క్వీన్ బిరుదుపై రియాక్ట్ అయ్యింది.
సోషల్ మీడియాలో తనపై జరిగే ట్రోల్స్ గురించి ఎలాంటి బాధ లేదని తెలిపింది. శాకుంతలం విడుదల సమయంలో తన వ్యాధి గురించి బయటపెట్టానని తెలిపింది.
ఆ సమయంలో తాను కేవలం సింపతి కోసమే అలా చేశానని అనుకున్నారని తెలిపింది. కానీ అది వాస్తవం కాదని.. యశోద, శాకుంతలం చిత్రాలకు తనే బలమని చెప్పుకొచ్చింది.
దీంతో ఆ సినిమాలకు కచ్చితంగా ప్రచారం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని పేర్కొంది. అలాంటి సమయంలో సినిమాలను ప్రమోట్ చేయకపోతే చచ్చిపోతుందని తెలిపింది.
శాకుంతలం మూవీ వేదికపై కొంత సమయంపాటు సంతోషంగా కనిపించడంతో బాగానే ఉన్నానని అందరూ భావించారని.. ఆప్పటికే ఆరోగ్యం బాలేదని వెల్లడించింది.
ఆరోగ్యం బాగాలేదని మీడియా ముందుకు నీరసంగా రాలేను కదా.. అందుకే అలా కనిపించానని క్లారిటీ ఇచ్చింది. తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే అలా కామెంట్స్ వచ్చాయి.
అప్పటికే తన ఆరోగ్య స్థితిపై చాలా రూమర్స్ వచ్చాయని.. ఆరోగ్యం బాలేకున్నా ఆ వేదికపై చాలా యాక్టివ్ గా కనిపించానని ఎమోషనల్ అయ్యింది సామ్.
ఇక్కడ క్లిక్ చేయండి.