సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. ఏ మాయ చేశావే సినిమా తో తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.
మొదటి సినిమాతోనే పెద్ద హిట్ కొట్టి కెరీర్ పరంగా ముందుకు దూసుకుపోతుంది ఈ చిన్నది. గత పదిహేనుళ్లుగా ఇండస్ట్రీని ఏలుతోంది ఈ బ్యూటీ.
కెరీర్ పరంగా దూసుకుపోతున్న సమయం లో టాలీవుడ్ స్టార్ హీరో కొడుకు నాగ చైతన్యను ప్రేమించి 2017లో పెళ్లి వీరు పెళ్లి చేసుకున్నారన్న విషయం తెలిసిందే.
అయితే కొన్ని సంవత్సరాలకే పూర్తి కారణాలు తెలియదు కానీ 2021 అక్టోబర్ నెలలో సమంత నాగ చైతన్య విడాకులు తీసుకున్నారు..
ప్రస్తుతం నాగ చైతన్య అయితే తెలుగు హీరోయిన్ శోభిత దూళిపాళను ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి సిద్దపడినప్పటికీ సమంత మాత్రం ఇప్పట్లో పెళ్లి చేసుకునేలా కనిపించట్లేదు.
అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న సామ్.. తెలుగు , తమిళ్ చిత్రాలతో మరింత ఇమేజ్ దక్కించుకుని ప్రస్తుతం బాలీవుడ్ లో దూసుకుపోతుంది.
సమంత ప్రస్తుతం వరుణ్ ధావన్ తో కలిసి సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.. త్వరలోనే అమెజాన్ వేదికగా స్ట్రీమింగ్ కి సిద్ధం కానుంది.