సంచలన నిర్ణయం తీసుకున్న సమంత.. షాక్ లో ఫ్యాన్స్

అభిమానులకు, నిర్మాతలకు స్టార్‌ హీరోయిన్‌ సమంత భారీ షాకిచ్చింది.

ప్రస్తుతం సమంత ‘సీటాడెల్‌’వెబ్‌ సిరీస్‌లో నటిస్తుంది.

దీంతో పాటు విజయ్‌ దేవరకొండతో ‘ఖుషి’ చిత్రం చేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్‌ నడుస్తుంది.

ఈ రెండు సినిమాల షూటింగ్స్‌ పూర్తయిన తర్వాత సమంత లాంగ్‌ బ్రేక్‌ తీసుకోనున్నారట.

ఇకపై ఆమె ఎలాంటి కొత్త ప్రాజెక్టులకు సైన్‌ చేయొద్దని నిర్ణయం తీసుకున్నారట.

దాదాపు ఏడాది పాటు సినిమాలకు గ్యాప్‌ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ ఏడాదిలో తన ఆరోగ్యం, వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టనున్నారట.

 వచ్చే ఏడాది లేదా ఆ తర్వాతే ఆమె కొత్త సినిమాలకు సైన్‌ చేస్తారట.

ఆ లోపు ఖుషి సినిమా ప్రమోషన్స్‌కి మాత్రం ఆమె హాజరవుతారవుతున్నట్లు సమాచారం.