సమంత జీవితాన్నే మార్చేసిన సినిమా.. అందుకే ఇప్పుడిలా..
Rajitha Ch
anti
09 August 2024
చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సమంత ఇప్పుడిప్పుడే మళ్లీ వెండితెరపై మెరిసేందుకు సిద్ధమవుతుంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది.
బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ సరసన ఓ సినిమా.. అలాగే మలాయళంలో మమ్ముట్టి జోడిగా మరో సినిమాతోపాటు తమిళంలో విజయ్ సరసన మళ్లీ కనిపించనుందట.
వీటితోపాటు హిందీలో వరుణ్ ధావన్ జోడిగా సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటించినందుకు భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటుందని కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తుంది.
ఇటీవల ఓ భేటీలో పాల్గొన్న సమంతను ఉద్దేశిస్తూ.. మీరు నటిగా మారడానికి కారణం ఏమిటని ప్రశ్నించగా.. ఆసక్తికర కామెంట్స్ చేసింది హీరోయిన్ సమంత.
తాను సాధారణ కుటుంబంలో పుట్టిన అమ్మాయినని, తన ఉన్నత చదువుకు ఫీజు కూడా కట్టలేని పరిస్థితిలో తన తండ్రి ఉన్నారని చెప్పుకొచ్చింది హీరోయిన్ సామ్.
దీంతో వేరే దారి లేక తాను సినిమాల్లోకి రావాల్సిన పరిస్థితి వచ్చిందని.. రూ.500 కోసం ఓ హోటల్లో హోస్ట్ గా పనిచేసినట్లు ఆరోజులను గుర్తుచేసుకుంది సమంత.
కానీ సినిమా తన జీవితాన్నే మార్చేసిందని.. సినీ పరిశ్రమలో తాను ఎన్నో విషయాలను నేర్చుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం చేతిలో నాలుగైదు చిత్రాలున్నాయి.
అలాగే మరోవైపు నిర్మాతగానూ మారుతుంది సామ్. ఇదిలా ఉంటే చివరిసారిగా సామ్ ఖుషీ చిత్రంలో నటించింది. ఇందులో విజయ్ దేవరకొండ హీరోగా నటించాడు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి