TV9 Telugu

సమంత సరికొత్త ఇన్నింగ్స్.. అలంటి పాత్రలకైన సిద్ధం అంటున్న మృణాల్..

15 Febraury 2024

లైఫ్‌లో సరికొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నట్టు తెలిపింది టాలీవుడ్ స్టార్ కథానాయక సమంత రూత్ ప్రభు.

కొన్నాళ్లుగా సినిమా దూరంగా ఉంటున్న ఆమె త్వరలోనే పాడ్‌ కాస్ట్ ద్వారా తన అనుభవాలను పంచుకుంటానని చెప్పింది.

చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడమంటే ఇష్టమని, ఏ సబ్జెక్టునైనా లోతుగా పరిశీలిస్తానని అంది హీరోయిన్ సమంత.

తన అనుభవాలను అభిమానులతో పంచుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు తాజాగా సోషల్ మీడియా ద్వారా తెలిపింది.

తనకు చాలా హిందీ సినిమాల్లో పలు అవకాశాలు వస్తున్నాయని చెపింది టాలీవుడ్ సీతమహాలక్ష్మి మృణాల్‌ ఠాకూర్‌.

అయితే అవేవీ ప్రేక్షకులకు పదికాలాల పాటు గుర్తుండిపోయే సినిమాలు కాదని చెప్పింది హీరోయిన్ మృణాల్ ఠాకూర్.

ఏడాదికి ఐదు సినిమాల్లో హీరోయిన్ గా నటించాలనే లెక్కలు తనకు లేవనినంది తెలుగు ప్రేక్షకుల సీతమహాలక్ష్మి.

నటనకు ప్రాధాన్యం ఉందనిపిస్తే తల్లి, సోదరి పాత్రల్లో నటించడానికి కూడా తాను వెనకాడనని చెప్పింది ఈ వయ్యారి.