Samantha:  ఇద్దరు పిల్లలను దత్తత తీసుకోనున్న సమంత!!

23 November 2023

విజయ్‌ దేవరకొండ ఖుషి సినిమా తర్వాత మరే మూవీలోనూ కనిపించలేదు టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత

మయోసైటిస్‌ చికిత్స కోసం కొన్ని నెలలుగా అమెరికాలోనే ఉన్న సమంత ఇటీవలే ఇండియాకు తిరిగొచ్చింది

సినిమాల సంగతి పక్కనుంచితే సామ్‌లో మంచి సేవా గుణం ఉంది. అందుకే తరచూ సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటోందీ అందాల తార

ఇప్పటికే ప్రత్యూష ఫౌండేషన్‌ నెలకొల్పి స్వచ్ఛందంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందీ స్టార్‌ హీరోయిన్‌

ఇప్పటికే ఎందరో చిన్నారులకు అండగా నిలిచిన సామ్  త్వరలో ఇద్దరు చిన్నారలను దత్తత తీసుకోవాలనుకుంటోందట

పిల్లల బాధ్యతను తీసుకోవాలనుకుంటోందట. అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు సామ్‌