TV9 Telugu
27 January 2024
ఇచ్చిన మాట కోసం సల్మాన్ ఖాన్ గొప్ప మనసు.!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇటీవలే టైగర్ 3 సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.
వెండితెరపైనే కాదు.. నిజ జీవితంలోనూ సల్మాన్ సూపర్ హీరో. మంచితనం, సాయం చేయడంలో ముందుంటాడు.
అందుకే ఆయనను అంతా భాయ్ జాన్ అని పిలుస్తుంటారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ 9 ఏళ్ల చిన్నారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు సల్మాన్.
4 ఏళ్ల వయసులో అతడికి ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు మరోసారి కలిసి ధైర్యం చెప్పాడు.
మహారాష్ట్రలోని ముంబైలో నివసిస్తున్న జగన్బీర్ అనే 4 ఏళ్ల బాలుడు 2018 నుంచి బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు.
ముంబైలోని టాటా మెమోరియల్ సెంటర్ లో జగన్బీర్ చికిత్స తీసుకుంటున్నాడు.
అయితే ఆ సమయంలో అతడు సల్మాన్ ఖాన్ చూడాలని ఉందంటూ చెప్పుకొచ్చారు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా ఇది చూసిన సల్మాన్ వెంటనే ఆ బాలుడిని కలుసుకున్నాడు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి