సల్మాన్ ఖాన్ బర్త్ డే స్పెషల్.. స్టార్ హీరో ఆస్తులు ఎంతో తెలుసా ?..
TV9 Telugu
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పుట్టిన రోజు నేడు. భాయిజాన్ ఈరోజు 58వ ఏట అడుగుపెట్టారు. 1965 డిసెంబర్ 27న ఇండోర్‌లో జన్మించారు సల్మాన్.
లైఫ్ స్టైల్ ఆసియా ప్రకారం సల్మాన్ ఖాన్ ఇప్పటివరకు దాదాపు రూ.2900 కోట్లు సంపాదించారట. ఒక్కో సినిమాకు రూ.100 కోట్లు తీసుకుంటాడు.
అంతేకాకుండా సంవత్సరానికి బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల నుండి రూ. 300 కోట్లు సంపాదిస్తున్నాడు. దుస్తులు, ఫిట్‌నెస్ పరికరాల వ్యాపారాలు కలిగి ఉన్నాడు.
2011లో స్థాపించబడిన 'సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్' పేరుతో ఫిల్మ్ ప్రొడక్షన్ సంస్థను ప్రారంభించాడు. యాత్రా.కామ్, చింగారి వంటి స్టార్టప్‌లలో పెట్టుబడి పెట్టారు.
ముంబైలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు సల్మాన్. ఈ ఇంటి విలువ దాదాపు రూ. 100 కోట్లు ఉంటుందట.
అలాగే పన్వెల్‌లో 150 ఎకరాల విస్తీర్ణంలో ఒక ఫామ్‌హౌస్, గోరైలో సముద్రానికి ఎదురుగా ఒక విలాసవంతమైన భవనాన్ని కలిగి ఉన్నాడు సల్మాన్.
సల్మాన్ వద్ద ఆడి A8L, ఆడి RS7, రేంజ్ రోవర్ వోగ్ ఆటోబయోగ్రఫీ, Mercedes Benz GL 350 CDI, Mercedes S క్లాస్ కలిగి ఉన్నారు
సల్మాన్ ఖాన్ చివరిసారిగా టైగర్ 3 చిత్రంలో కనిపించారు. ఈరోజు సల్మాన్ బర్త్ డే సందర్భంగా సెలబ్రెటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.