సలార్ కర్ణాటక రైట్స్.. ఘనంగా మంగళవారం ప్రీ రిలీజ్..
12 November 2023
పాయల్ రాజ్‌పుత్, రంగం ఫేమ్ అజ్మల్ అమీర్ జంటగా అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న సినిమా మంగళవారం నవంబర్ 17న విడుదల కానుంది.
తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నవంబర్ 11న హైదరాబాద్ జె.ఆర్.సి. కన్వెషన్ సెంటర్‌లో ఘనంగా జరిగింది.
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ సలార్. ఈ సినిమా కోసం అభిమానులు వేచి చూస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 22న విడుదల కానుంది.
తాజాగా దీని కన్నడ రైట్స్ హోంబళే ఫిల్మ్స్ తీసుకున్నారు. వాళ్లే సొంతంగా కర్ణాటకలో సలార్ సినిమాను విడుదల చేయబోతున్నారు.
శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో తేజ మార్ని తెరకెక్కిస్తున్న సినిమా ‘కోట బొమ్మాళి పి.ఎస్’. తాజాగా ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ విడుదల చేసారు.
విక్రాంత్ హీరోగా మెహ్రీన్ పిర్జాదా, రుక్సార్ హీరోయిన్స్‌గా నటిస్తున్న సినిమా స్పార్క్ ది లైఫ్ నవంబర్ 17న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేసారు.
మోహన్ లాల్ కెరీర్‌లోనే 2019లో వచ్చిన 'లూసిఫర్' ప్రత్యేకమైన స్థానంలో నిలిచింది. ఈ సినిమాతోనే దర్శకుడిగా పరిచయం అయ్యారు నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్.
తాజాగా ఈ చిత్ర సీక్వెల్ రెడీ అవుతుంది. షూటింగ్ వేగంగా జరుగుతుంది. లూసీఫర్ 2 ఫస్ట్ లుక్ విడుదల చేసారు మేకర్స్.