ఎలాంటి ఈవెంట్ లేకుండా సలార్ ట్రైలర్.. ఇంగ్లీష్ వర్షన్ లో లియో.. 

1 December 2023

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ సలార్. ఈ చిత్రం ట్రైలర్ ఇవాళ సాయంత్రం 7.19 గంటలకు విడుదల చేయబోతున్నారు మేకర్స్.

అయితే దీనికి ఎలాంటి ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లేదు. ప్రస్తుతం చిన్న సినిమాలకు కూడా ట్రైలర్ లాంఛ్ వేడుకలు చేస్తున్నారు.

సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ మూవీ ట్రైలర్ మాత్రం నేరుగా యూ ట్యూబ్‌లో విడుదల చేయబోతున్నారు దర్శక నిర్మాతలు.

అక్కినేని నాగార్జున హీరోగా కొరియోగ్రఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయం అవుతున్న తాజా సినిమా నా సామిరంగ.

ఈ చిత్ర షూటింగ్ ఊహించిన దానికంటే వేగంగా జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాల్సిందే అని ఫిక్స్ అయిపోయారు నాగార్జున.

డిసెంబర్ 7 నాటికి టాకీ పార్ట్ పూర్తి కానుందని తెలుస్తుంది. ఈ నెలలో అన్ని పూర్తి చేసుకొని ప్రమోషన్స్ షురూ చేయనున్నట్లు సమాచారం.

విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన కమర్షియల్ బ్లాక్‌బస్టర్ లియో. ఈ సినిమా దాదాపు 550 కోట్లకు పైగా వసూలు చేసింది.

ఈ చిత్ర ఓటిటి వర్షన్ ఇప్పటికే విడుదలైన దీనికి ఇంగ్లీష్ వర్షన్ కూడా సిద్ధం చేస్తున్నారు. ప్రముఖ ఓటిటిలో డిసెంబర్ 26 నుంచి ఈ ఇంగ్లీష్ వర్షన్ అందుబాటులోకి రానుంది.