సలార్ ట్రైలర్‌పై ఆ న్యూస్ అబద్ధమే.. చరణ్ ఫాన్స్ కి బ్యాడ్ న్యూస్..
12 November 2023
టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ మరణవార్తతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ సినిమా ఇండస్ట్రీ అంతా నివాళులు అర్పిస్తున్నారు.
సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన లేరనే వార్త తెలుసుకుని సహ నటులు కన్నీరు పెట్టుకుంటున్నారు.
రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా శంకర్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్. తాజాగా మరో షాకింగ్ న్యూస్ చెప్పారు మేకర్స్.
దివాళికి ప్లాన్ చేసిన ఫస్ట్ సింగిల్ రావట్లేదని తెలిపారు. ఆడియో డిస్టర్బెన్సుల వల్ల వాయిదా వేస్తున్నామని.. కొత్త డేట్ త్వరలోనే చెప్తామని క్లారిటీ ఇచ్చారు గేమ్ ఛేంజర్ టీం.
సలార్ ట్రైలర్ ఒకటే కట్ చేస్తున్నారని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంటే డైలాగ్స్ లేకుండా కేవలం యాక్షన్‌తోనే ఉంటుందని దాని అర్థం.
అయితే అందులో నిజం లేదని.. అలాంటిదేం ప్లాన్ చేయలేదని చెప్పారు ప్రశాంత్ నీల్. డిసెంబర్ 1న సలార్ ట్రైలర్ 7:19 గం"కి విడుదల కానుంది.
సునీల్ మలయాళ సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్నారు. మమ్ముట్టి సినిమాతో సునీల్ డెబ్యూ చేస్తున్నారు. వైశాఖ్ తెరకెక్కిస్తున్న టర్బో సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.
బేబీ ఫెమ్ విరాజ్ అశ్విన్ నటిస్తున్న సినిమా జోరుగా హుషారుగా. తాజాగా ఈ సినిమా నుంచి రప్ఫా రప్ఫా అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదలైంది.