ఎప్పటి నుంచో ఊరిస్తున్నా మోస్ట్ అవెయిటెడ్ అప్‌డేట్‌ను రివీల్ చేసింది యూనిట్. దీంతో గ్రాండ్ సెలబ్రేషన్స్‌కు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు డార్లింగ్ డై హార్డ్ ఫ్యాన్స్.
చాలా రోజులుగా సలార్ షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అప్‌డేట్స్ ఇచ్చేందుకు మాత్రం చాలా టైమ్ తీసుకున్నారు మేకర్స్.
ఆ మధ్య టీజర్ రిలీజ్ చేసినా అందులోనూ ప్రభాస్‌ను కంప్లీట్‌గా రివీల్ చేయకుండా దాచిపెట్టింది.
దీంతో సలార్ సినిమా స్టేటస్ ఏంటి? ఇన్ టైమ్‌లో మూవీ రిలీజ్ అవుతుందా లేదా అన్న డౌట్స్ రెయిజ్ అయ్యాయి.
తాజాగా సలార్ సినిమా బిజినెస్‌కు సంబంధించిన రూమర్స్ కూడా తెగ వైరల్ అయ్యాయి. దీంతో వెంటనే అలర్ట్ అయిన యూనిట్ డ్యామేజ్ కంట్రోల్ చేసే పని మొదలు పెట్టింది.
తాజాగా అభిమానులకు దీపావళి కానుక ఇచ్చింది యూనిట్. డిసెంబర్ 1, సాయంత్రం 7 గంటల 19 నిమిషాలకు ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నట్టుగా వెల్లడించారు.
ట్రైలర్ అప్‌డేట్‌తో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రభాస్ కూడా విదేశాల నుంచి తిరిగి వచ్చేయటంతో డిసెంబర్ 22న మాస్ జాతర పక్కా అంటున్నారు డార్లింగ్ డైహార్డ్ ఫ్యాన్స్.