సోషల్ మీడియాలో సలార్ హల్‌చల్.. పెళ్లి చేసుకున్న సల్మాన్ సోదరుడు..
27 December 2023
TV9 Telugu
రిలీజ్‌కు ముందు పెద్దగా అప్‌డేట్స్ ఇవ్వని సలార్ టీమ్, మూవీ రిలీజ్ తరువాత మాత్రం దీనిపై స్పీడు పెంచింది.
వరుసగా టీజర్స్, ఇంటర్వ్యూస్, మేకింగ్ వీడియోస్‌తో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది సలార్ సినిమా టీమ్.
తాజాగా త్రీడీ యానిమేషన్‌తో రూపొందించిన ఓ వీడియో సాంగ్ రిలీజ్ చేసింది సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ యూనిట్.
గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ఇప్పటికే 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సొదరుడు, నటుడు, దర్శకుడు, నిర్మాత అయినా అర్బాజ్ ఖాన్ మళ్లీ వివాహం చేసుకున్నారు.
బాలీవుడ్ సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్‌గా పని చేస్తున్న షురా ఖాన్‌ను తాజాగా ఆయన రెండో వివాహం చేసుకున్నారు.
ప్రస్తుతం అర్బాజ్ ఖాన్, షురా ఖాన్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.
1998లో మలైకా అరోరాను పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్, 2017లో ఆమెతో విడాకులు తీసుకున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి