TV9 Telugu
సమ్మర్‌లో శౌర్యాంగపర్వం షురూ!
05 March 2024
ప్రశాంత్ నీల్ సినిమాకు సంబంధించి ఆయనేం అప్‌డేట్స్ ఇవ్వక్కర్లేదు. ఆయన సినిమాల్లో ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అక్కడక్కడా లీకులు ఇచ్చేస్తుంటారు.
అసలే డార్లింగ్ ప్రభాస్‌తో ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా కాబట్టి లేటెస్ట్ గా సలార్ సీక్వెల్ మీద కూడా చాలా మందికి క్యూరియాసిటీ ఉంది.
ఈ సినిమా గురించి అప్‌డేట్ ఇచ్చారు నటుడు బాబీ సింహా. వచ్చే ఏడాది పార్ట్ 2 శౌర్యాంగపర్వం విడుదలవుతుందని అన్నారు.
దీన్ని బట్టి ఈ సమ్మర్‌లోనే సలార్ పార్ట్ 2 శౌర్యాంగపర్వం మూవీ షూటింగ్ స్టార్ట్ చేసేయాలి ప్రశాంత్ నీల్.
బాహుబలి తర్వాత ఎప్పుడూ సెట్స్ మీద ఒకటికి మూడు సినిమాలు షూటింగ్స్ ఉండటం ప్రభాస్‌కి కూడా అలవాటైపోయింది.
గేమ్ ఆఫ్ థ్రోన్స్ లా ఉండే సెకండ్ పార్టు కోసం సినిమా హీరో ప్రభాస్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సలార్ రెండో భాగానికి సంబంధించి ఆల్రెడీ స్క్రిప్ట్ పూర్తయిందని గతంలో నిర్మాత విజయ్ కిరగందూర్ చెప్పారు.
అంతా ఓకే అయితే ఏప్రిల్ లో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. దీనిపై ఇంకా క్లారిటీ రావాలి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి