డార్లింగ్ అభిమానులకు శుభవార్త.. సలార్ టీజర్ ఆ రోజునే..

ప్రభాస్ హీరోగా చేస్తున్న తాజా చిత్రం ‘సలార్‌’.

ఈ చిత్రాన్ని కేజీఎఫ్‌ ఫేమ్ ప్రశాంత్ నిల్ తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రంలో జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ప్రభాస్‌కి జోడిగా శృతి హాసన్ కథానాయకిగా కనిపించనుంది.

హోంబలే ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటె జులైలో ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

అనుకున్నట్లుగానే ఈ మూవీ టీజర్‌ను గురువారం(జులై 6) విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

ఈ మేరకు తేదీ, సమాయంతో కూడిన ఓ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్.

కాగా ఈ చిత్రం సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.