సక్సెస్ సంబరాల్లో సలార్ టీం.. జపాన్ లో విడుదలకు సిద్ధం..
TV9 Telugu
09 January 2024
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ సినిమాకు 600 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి.
కెరీర్‌లో మూడుసార్లు 600 కోట్ల సినిమాలు ఇచ్చిన ఏకైక హీరోగా చరిత్ర సృష్టించారు రెబెల్ స్టార్ ప్రభాస్.
గతంలో రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి, బాహుబలి 2.. ఇప్పుడు సలార్‌తో ఈ రికార్డు అందుకున్నారు రెబల్ స్టార్.
తాజాగా మాస్ యాక్షన్ చిత్రం సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ కేక్ కట్ చేసి సక్సెస్ సంబరాలు చేసుకున్నారు ఈ చిత్రయూనిట్.
ఈ సెలెబ్రేషన్స్ కి డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో ప్రభాస్‌తో పాటు పృథ్వీరాజ్ మిగిలిన టీం అంతా హాజరయ్యారు.
సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ సినిమాను సమ్మర్‌లో జపాన్‌లో కూడా విడుదల చేయనున్నట్టు తెలిపారు ఈ మూవీ మేకర్స్.
జపాన్‌లో ప్రభాస్ సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. దింతో అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని భావించారు మేకర్స్.
పృథ్విరాజ్ సుకుమారన్, శ్రుతిహాసన్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటించిన సినిమా సలార్. హోంబలే సంస్థ నిర్మించింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి