సలార్ ఓవర్సీస్ రికార్డ్స్.. నితిన్‌తో కాంతార హీరోయిన్..
14 December 2023
ప్రభాస్, ప్రశాంత్ కాంబోలో వస్తున్న సలార్ సినిమాపై ఇండియాలోనే కాదు.. ఓవర్సీస్‌లోనూ అదే స్థాయి అంచనాలున్నాయి.
ఇప్పటికే అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ చిత్రానికి అదిరిపోయే స్పందన వస్తుంది.
అమెరికాలో 347 లొకేషన్లలో బుకింగ్స్ ఓపెన్ అయితే.. ఇప్పటికే 6 లక్షల డాలర్ల వరకు వసూలు చేసింది సలార్ మూవీ.
అదే సమయంలో షారుక్ ఖాన్ హీరోగా వస్తున్న డుంకీ మాత్రం 328 లొకేషన్లలో కేవలం 90 వేల డాలర్లను వసూలు చేసింది.
రిలీజ్‌కు మరో 8 రోజుల సమయం మాత్రమే ఉండటంతో సలార్ అండ్ డుంకీ చిత్రాల మధ్య ఉన్న పోటీ ఆసక్తికరంగా మారింది.
నితిన్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న సినిమా తమ్ముడు. ఈ చిత్ర షూటింగ్ సైలెంట్‌గా జరుగుతుంది.
ఎలాంటి సందడి లేకుండా షూటింగ్ పూర్తి చేస్తున్నారు వేణు. షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కూడా జరుగుతుంది.
ఇదిలా ఉంటే ఈ చిత్రంలో కాంతారా ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్‌గా నటిస్తున్నారని తెలుస్తుంది. అజినీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి