రెండో రోజూ బాక్సాఫీస్ ను షేక్ చేసిన ‘సలార్’

24 December 2023

TV9 Telugu

రెబెల్ స్టార్ ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన 'సలార్'... బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతోంది.

తొలిరోజునే దాదాపు రూ.178 కోట్లు వసూలు చేసి.. వండర్ క్రియేట్ చేసింది ఈ భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం.

కేవలం అడ్వాన్స్ బుకింగ్ తోనే సుమారు రూ.90 కోట్లకు పైగా రాబట్టి సత్తా చాటింది ప్రభాస్ హీరోగా చేసిన సలార్.

2023 సంవత్సరంలో ఫస్ట్ డేనే హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా మరో రికార్డ్ కూడా సలార్ ఖాతాలో పడింది.

సలార్ మూవీకి దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో కూడా మంచి ఆదరణ లభించింది.

సలార్ మూవీ రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.143 కోట్ల షేర్, రూ.295.7 కోట్ల గ్రాస్ వసూలు చేసింది!

సలార్ సినిమాకు మొత్తం అన్ని ఏరియాల్లో కలిపి రెండు రోజుల్లో దాదాపు రూ.345 కోట్లుపైగా బిజినెస్ జరిగిందని సమాచారం.

రూ.347 కోట్ల షేర్ వస్తే ఈ సినిమా దుమ్మురేపినట్టే. ఈ లెక్కన మరో రూ.203 కోట్ల షేర్ వస్తే దూసుకుపోయినట్టే.