సైథాన్ టీజర్‌.. మాజీ వింగ్ కమాండర్ తో వరుణ్..

TV9 Telugu

26 January 2024

అజయ్ దేవ్‌గన్, మాధవన్, జ్యోతిక ప్రధాన పాత్రల్లో దర్శకుడు వికాస్ భెల్ తెరకెక్కిస్తున్న సినిమా సైథాన్.

హార్రర్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం వస్తుంది. ఈ ఏడాది మార్చ్ 8న సైథాన్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుండటంతో.. సినిమాపై అంచనాలు కూడా బాగానే పెరిగిపోయాయి.

విశాల్, ప్రియా భవానీ శంకర్ జంటగా మాస్ సినిమాల స్పెషలిస్ట్ హరి తెరకెక్కిస్తున్న యాక్షన్ సినిమా రత్నం.

ఈ సినిమా టీజర్‌తో పాటు పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం ఎప్రిల్ 26న విడుదల కానున్నట్లు తెలిపారు దర్శక నిర్మాతలు.

వరుణ్ తేజ్, మానుషి ఛిల్లర్ జంటగా కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కిస్తున్న దేశభక్తి నేపథ్యం ఉన్న సినిమా ఆపరేషన్ వాలంటైన్.

ఫిబ్రవరి 16న విడుదల కానుంది ఈ చిత్రం. జనవరి 26 సందర్భంగా మాజీ వింగ్ కమాండర్ మైనేనా శ్రీనాథ్‌ను కలిసారు వరుణ్ తేజ్.

ఆపరేషన్ వాలంటైన్ సినిమాకు సంబంధించిన వివరాలను ఆయనతో పంచుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైందిప్పుడు.