కుటుంబంతో  ‘సైంధవ్‌’.. పోస్టర్ విడుదల..

20 September 2023

వెంకటేష్ హీరోగా  శైలేష్‌ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సైంధవ్‌’. వెంకటి బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో వెంకీకి జోడిగా శ్రద్ధా శ్రీనాథ్‌ నటిస్తున్నారు. మరో ఇద్దరు హీరోయిన్ల చోటు ఉండగా రుహాని శర్మ, ఆండ్రియా చేస్తున్నారు.

ఈ చిత్రంలో నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, బేబీ సారా, తమిళ హీరో ఆర్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇది వెంకటేష్‌ కి 75వ చిత్రం.

ఇది వెంకీ మొదటి పాన్ ఇండియా చిత్రం. అందులోని హిట్ 2 బ్లాక్ బస్టర్ తర్వాత శైలేష్‌ డైరెక్ట్ చేస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలే నెలకొన్నాయి.

ఇదివరకు విడుదలైన ఈ చిత్రం పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబరు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదిలా ఉంటె తాజాగా ఈ చిత్రం నుంచి ఓ కొత్త అప్డేట్ వచ్చింది. అదేంటంటే ఓ కొత్త పోస్టర్ కి సోషల్ మీడియాలో పంచుకున్నారు మూవీ మేకర్స్.

ఆ కొత్త పోస్టర్‌లో వెంకటేష్, శ్రద్ధ శ్రీనాథ్, బేబీ సారా బీచ్ లో సరదాగా గడుపుతూ కనిపించి ఆకట్టుకున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. క్రిస్మస్ కు కచ్చితంగా విడుదల చేసేలా కష్టపడుతుంది మూవీ టీం.