అందం ఈమెను చూస్తే ప్రేమలో పడుతుందేమో..

14 October 2023

29 ఆగస్టు 1998న మహారాష్ట్ర రాజధాని ముంబైలో నటులు మేధా, మహేష్ మంజ్రేకర్ దంపతులకు జన్మించింది అందాల తార సాయి మంజ్రేకర్.

ముంబైలోని NSS హిల్ స్ప్రింగ్ ఇంటర్నేషనల్ స్కూల్ ముంబై విశ్వవిద్యాలయంలో తన విద్యను పూర్తిచేసింది ఈ ముద్దుగుమ్మ.

2012లో మరాఠీ చిత్రం కక్స్‌పర్ష్ కుషీ దామ్లే అనే పాత్రలో బాలనటిగా కనిపించి సినీ రంగ ప్రవేశం చేసింది ఈ వయ్యారి.

2019లో హిందీ యాక్షన్-కామెడీ దబాంగ్ 3లో సల్మాన్ ఖాన్ సరసన మొదటిసారి కథానాయకిగా లీడ్ రోల్ లో ఆకట్టుకుంది ఈ భామ.

2022లో  వరుణ్ తేజ్ కి జోడిగా గని సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ బ్యూటీ. అయితే ఈ చిత్రం ఆశించిన ఫిలితం అందుకోలేకపోయింది.

దీని తర్వాత మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ గా వచ్చిన మేజర్ సినిమాలో అడివి శేష్ పక్కన హీరోయిన్ గా మెప్పించింది.

2023లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా వచ్చిన స్కంద చిత్రంలో కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకుంది.

కుచ్ ఖట్టా హో జాయ్, ఔరోన్ మే కహా దమ్ థా అనే రెండు హిందీ చిత్రాల్లో నటిస్తుంది వయ్యారి భామ సాయి మంజ్రేకర్.