ఊరమాస్.. సాయిధరమ్‌తేజ్ గాంజా శంకర్ ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది..

16 October 2023

విరూపాక్ష సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు సూప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. ఈ సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చాడు ఈ మెగా హీరో.

ఇటీవలే బ్రో సినిమాతో థియేటర్లలో అలరించాడు. తొలిసారిగా తన మేనమామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించాడు.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది. ఈ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న సాయి ధరమ్‌ తేజ ఇప్పుడు మరో సినిమాను అనౌన్స్ చేశాడు.

సంపత్‌ నంది డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ సినిమాలో సాయితేజ్‌ పక్కా ఊరమాస్ లుక్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

అక్టోబర్ 15న సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు కావడంతో ఈ మూవీ గ్లింప్స్ అధికారికంగా రిలీజ్ చేశారు మూవీ మేకర్స్.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాకు గాంజా శంకర్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుపుతూ.. వీడియో గ్లింప్స్ విడుదల చేశారు.

చాలా కాలం తర్వాత పూర్తిస్థాయి మాస్ హీరోగా కనిపించనున్న సాయి ధరమ్ తేజ్.. గాంజా శంకర్ సినిమాతో మరో హిట్ అందుకోవడం ఖాయంగా తెలుస్తోంది.

ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో తేజ జోడిగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తున్నట్లుగా తెలుస్తోంది.