ఏడవ తరగతిలోనే లవ్ లెటర్ రాసిన సాయి పల్లవి.. కానీ..
TV9 Telugu
Pic credit - Instagram
ఫిదా సినిమాతో తెలుగు ప్రజల గుండెల్లో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పర్చుకుంది హీరోయిన్ సాయి పల్లవి. మొదటి సినిమాతోనే తన సహజ నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఆ తర్వాత ఈ న్యాచురల్ బ్యూటీకి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. కానీ కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తుంది. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా ఉంటుంది.
సాయి పల్లవి చివరగా.. విరాటపర్వం, గార్గి చిత్రాల్లో కనిపించింది. ఇక ప్రస్తుతం న్యాచురల్ బ్యూటీ తండేల్ సినిమాలో నటిస్తుంది. ఇందులో అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్నారు.
నిజానికి హీరోయిన్స్ అందరిలోనూ సాయి పల్లవి ప్రత్యేకం. తక్కువ మేకప్.. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఇక ఎప్పుడూ సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తుంది.
కానీ స్కూల్ డేస్ లోనే ప్రేమలేఖలు రాసిందట. తను రాసుకున్న ప్రేమలేఖ ఇప్పటకీ తనకు గుర్తుందని.. అదే మొదటి, అదే చివరి ప్రేమలేఖ అని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
ఏడవ తరగతిలోనే స్కూల్లో ఓ అబ్బాయి బాగా నచ్చాడని.. అతడికి లవ్ లెటర్ రాసానని.. కానీ అతడికి ఇచ్చే ధైర్యం లేక.. ఆ ప్రేమ లేఖను ఇవ్వలేకపోయానని.. ఇప్పటికీ ఉందట.
ఓ రోజు ఆ లెటర్ ఇంట్లో వాళ్లు చూసి బాగా తిట్టారని.. కొట్టారని.. దీంతో మళ్లీ అలాంటి లెటర్ల జోలికి వెళ్లడమే మానేసానని.. ఆ తిట్లు, దెబ్బలు ఇంకా గుర్తున్నాయని చెప్పుకొచ్చింది.
ఆ వయసులోనే అలాంటి లేఖ ఎలా రాయగలిగాను అని ఇప్పటికీ ఆశ్చర్యంగా అనిపిస్తుందని.. ఇప్పుడు ఆ సంఘటన తలుచుకుంటే మాత్రం చాలా నవ్వు వస్తుందని తెలిపింది సాయి పల్లవి.