బాలీవుడ్ సినిమాలో సాయి పల్లవి.. ఊహించని పాత్రలో న్యాచురల్ బ్యూటీ..
Pic credit - Instagram
సాయి పల్లవి.. తెలుగు ప్రేక్షకులకు చాలా ఇష్టమైన హీరోయిన్. ఈ బ్యూటీకి దక్షిణాది చిత్రపరిశ్రమలో ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే.
గార్గి తర్వాత చాలా నెలలు ఈ బ్యూటీ మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. ఇటీవలే కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ జోడిగా తమిళ్ సినిమాలో నటిస్తుంది సాయి పల్లవి.
అలాగే అక్కినేని నాగచైతన్య తో మరోసారి జోడి కట్టనుంది. చైతు నటిస్తోన్న కొత్త ప్రాజెక్టులో సాయి పల్లవి నటించనుందని ఇటీవలే మేకర్స్ అధికారికంగా ప్రకటించింది.
ఇక ఇప్పుడు సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. భారీ బడ్జెట్ చిత్రం రామయణంలో న్యాచురల్ బ్యూటీ భాగమవ్వనుందని తెలుస్తోంది.
ఈ మూవీలో రణబీర్ కపూర్ రాముడిగా... సీతగా సాయి పల్లవి, రావణాసురుడిగా కేజీఎఫ్ యష్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడితే నెట్టింట హాట్ టాపిక్.
ఈ చిత్రానికి దంగల్ ఫేమ్ నితీష్ తివారి దర్శకత్వం వహించనున్నారని.. ఈ చిత్రాన్ని మూడు భాగాలుగా తీయాలని భావిస్తున్నారట మేకర్స్.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుందని.. మొదటి భాగంలో సీతారాములకు సంబంధించిన సీన్స్ ఉంటాయని అంటున్నారు.
ఇక రెండో భాగంలో సీతను రావణుడు లంకకు తీసుకెళ్లడం.. మూడో భాగంలో లవకుశల పుట్టుకకు సంబంధించిచన అంశాలు ఉంటాయని అంటున్నారు.