తొలిసారి రొమాంటిక్ సాంగ్ చేయనున్న సాయి పల్లవి.. హీరో ఎవరంటే..
TV9 Telugu
Pic credit - Instagram
తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్ సాయి పల్లవి. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే మెస్మరైజ్ చేసింది.
ఇండస్ట్రీలో ఇప్పుడున్న హీరోయిన్లలో సాయి పల్లవి ప్రత్యేకం. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ కంటెంట్.. పాత్ర ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యింది.
సాయి పల్లవి నటనకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. విరాట పర్వం, గార్గి చిత్రాల తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న ఈ న్యాచురల్ బ్యూటీ తండేల్ సినిమాలో నటిస్తుంది.
చందూ మోండేటీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్నారు. అలాగే తమిళంలో హీరో శివకార్తికేయన్ సరసన అమరన్ సినిమా చేస్తుంది.
తాజాగా ఈ బ్యూటికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. పెరియసామి తెరకెక్కిస్తున్న అమరన్ సినిమాలో సైనికుడిగా కనిపించనున్నారు.
ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మరో పది రోజుల్లో చిత్రీకరణ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఓ రొమాంటిక్ సాంగ్ ఉండనుందట.
రొమాంటిక్ పాటలలో ఇప్పటివరకు సాయి పల్లవి కనిపించలేదు. ఇప్పటివరకు కథకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చింది. ఇక ఈ సినిమాలోనూ కథకు అవసరం మేరకే ఒప్పుకుందట.
ఈ సినిమాను ఆగస్ట్ నెలలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు మేకర్స్. అలాగే ఇటు తండేల్ సినిమాలో సాయి పల్లవి మరోసారి గ్రామీణ అమ్మాయిగా కనిపించనుంది.