తప్పయితే సారీ చెప్పేస్తా!

TV9 Telugu

14 March 2024

టాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ సాయిపల్లవి కొన్ని విషయాలను కుండలు బద్ధలు కొట్టినట్టు మాట్లాడతారు.

మనసుకు ఏం అనిపిస్తే అదే చెప్పడానికి ప్రయత్నిస్తారు. మనసు మీద ముసుగు వేసుకోవడం చేతకాదంటారు ఈ వయ్యారి భామ.

నమ్మిన విషయాన్ని ఎవరితోనైనా ఓపెన్‌గా చెప్పేయడానికి ఎప్పుడూ వెనకాడరు ఈ సౌత్ ఇండస్ట్రీ స్టార్ కథానాయక.

ఒకవేళ ఆమె చేసిన కామెంట్‌లో ఏదైనా తప్పు ఉంటే, ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే సారీ చెప్పేస్తారు ఈ బ్యూటీ.

సమాజంలో ప్రతి ఒక్కరూ అభివృద్ధి కోసమే పనిచేస్తారు. కాకపోతే, ప్రతి విషయం మీద ఎవరి అభిప్రాయాలు వాళ్లకుంటాయి.

వాటిని పూర్తిగా వ్యక్తిగతమైన భావాలుగా మాత్రమే తీసుకోవాలి. అలా కాకుండా ఓ వర్గానికి ఆపాదించినప్పుడు ఇబ్బంది కలుగుతుంది అని అంటారు సాయిపల్లవి.

అందుకే తనకు అవగాహన లేని విషయాల మీద స్పందించమని ఎవరైనా అడిగినప్పుడు సైలెంట్‌గా ఉండిపోతానని అన్నారు ఈ భామ.

మాట్లాడితే మాత్రం తప్పకుండా పూర్తి సమాచారం తెలుసని అర్థం చేసుకోవచ్చని తెలిపారు ఈ తరం మహానటి సాయిపల్లవి.