15 May 2025
ఆ సినిమా షూటింగ్ సెట్‍లో గుక్కపెట్టి ఏడ్చిన సాయి పల్లవి.. ఎందుకంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
ఇటీవలే తండేల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది హీరోయిన్ సాయి పల్లవి. ప్రస్తుతం రామాయణం సినిమా షూటింగ్లో బిజీగా ఉంది.
హిందీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న రామాయణ సినిమాలో రాముడిగా రణబీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి కనిపించనున్నారు.
అయితే ఓ సినిమా షూటింగ్ సెట్‍లో సాయి పల్లవి గుక్కపెట్టి ఏడ్చిందట. శారీరకంగా, మానసికంగా ఎంతో ఇబ్బందిపడి కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలిపింది.
ఆ సినిమా మరెదో కాదు.. శ్యామ్ సింగరాయ్. ఆ సినిమా ఒక రోజు షూట్ పూర్తైతే తాను ఎంతో ఆనందపడేదాన్ని అని.. ఎక్కువగా రాత్రిళ్లు షూట్ చేశారట.
రాత్రి షూటింగ్స్ తనకు అస్సలు అలవాట లేదని.. పైగా పగలు తనకు నిద్రరాదని.. దీంతో రాత్రిళ్లు తన పరిస్థితి వర్ణనాతీతంగా ఉండేదని గుర్తు చేసుకుంది.
రాత్రి షూటింగ్ సమయంలో తెల్లవారే వరకు మేల్కొని ఉండాల్సి వచ్చేదని.. అలా దాదాపు 30 రోజులు అదే పరిస్థితి ఉండడం.. ఇతర సినిమా షూటింగ్స్ ఉండేవట.
దీంతో విశ్రాంతి లేకుండా పనిచేయడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై.. రాత్రి శ్యామ్ సింగరాయ్, ఉదయం మరో సినిమా షూటింగ్ చేసేదాన్ని అని తెలిపింది.
దీంతో విశ్రాంతి దొరికితే బాగుంటుందని తన చెల్లెలి ముందు ఏడ్చేశానని.. చివరకు నిర్మాతకు తెలియడంతో పదిరోజులు సెలవు తీసుకోమని చెప్పారట.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్