24 October 2024
అలాంటి దుస్తులు అందుకే వేసుకోను.. సాయి పల్లవి కామెంట్స్..
Rajitha Chanti
Pic credit - Instagram
ప్రేమమ్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది సాయి పల్లవి. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది ఈ మలయాళీ కుట్టి.
ఆ తర్వాత ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి పల్లవి టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్‌తో స్టార్ డమ్ అందుకుంది.
ప్రస్తుతం తమిళంలో శివకార్తికేయన్ సరసన అమరన్ చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే.
దీపావళి కానుకగా అక్టోబర్ 31న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది.
ఎంబీబీఎస్ చేసేందుకు జార్జియా వెళ్లిన తాను టాంగో డాన్స్ కోసం పొట్టి డ్రెస్ వేసుకున్నానని.. కానీ ప్రేమమ్ రిలీజ్ తర్వాత ఆ వీడియో వైరలయ్యింది.
దీంతో తన పాత వీడియోలను చూసి సోషల్ మీడియాలో ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్ చూసి తనకు చాలా బాధ కలిగిందని అసలు విషయం చెప్పేసింది.
అప్పటి నుంచే పొట్టి డ్రెస్సులు వేసుకోవద్దని నిర్ణయించుకున్నానని.. డ్రెస్‌ల విషయంలో తాను తీసుకున్న నిర్ణయం నియమంగా మారిందని తెలిపింది.
ఆ నియమాన్ని తప్పనిసరిగా పాటించాలని తనకు తాను నిబంధన పెట్టుకుందట సాయి పల్లవి. దీంతో తనకు ఆఫర్స్ తగ్గాయని అనుకుంటున్నట్లు తెలిపింది.
ఇక్కడ క్లిక్ చేయండి.