29 January 2025

తండేల్ సినిమాకు సాయి పల్లవి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ?

Rajitha Chanti

Pic credit - Instagram

సినీరంగంలో ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ అందరిలో సాయి పల్లవి ప్రత్యేకం. ఆమెకు యూత్‏లో ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. 

అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ సహయ నటనతో అడియన్స్ హృదయాలు గెలుచుకుంది.

హీరోయిజం, గ్లామర్ రోల్స్ ఉన్న చిత్రాలు కాకుండా కంటెంట్ ప్రాధాన్యత.. పాత్ర ప్రాముఖ్యతను చూస్తూ తన సినిమాలను ఎంచుకుంటుంది. 

గతేడాది అమరన్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ నటించిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. 

ఇక ఇప్పుడు ఆమె తండేల్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాగచైతన్య హీరో. 

లవ్ స్టోరీ తర్వాత నాగ చైతన్య, సాయి పల్లవి కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ట్రైలర్ విడుదలైంది. 

ఈ సినిమాకు సాయి పల్లవి రూ.5 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. కొన్నాళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. 

ముఖ్యంగా ఆమె నటనలో ఉన్న నేచురల్ టాలెంట్, డ్యాన్స్ స్కిల్స్, అడియన్స్ ను ఎట్రాక్ట్ చేస పవర్ ఆమెకు లెవల్ కు తీసుకెళ్లేలా కనిపిస్తుంది.