ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో సాయి పల్లవి రికార్డ్.. 9 ఏళ్ల కాలంలోనే ఏకంగా..
TV9 Telugu
13 JULY 2024
మలయాళ నాచురల్ బ్యూటీ సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిందామె.
గ్లామర్ కంటే కథా బలం ఉన్న పాత్రలనే ఎంపిక చేసుకుంటోంది సాయి పల్లవి. అందుకే తొమ్మిదేళ్ల కెరీర్‌లో ఆమె కేవలం 19 సినిమాల్లో మాత్రమే నటించింది.
ఇక సాయి పల్లవి అందం, అభినయానికి పలు అవార్డులు, ప్రశంసలు వచ్చాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ కీర్తి కిరీటంలో మరో అవార్డు వచ్చి చేరింది.
సౌత్ ఫిలిం ఇండస్ట్రీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2023లో హీరోయిన్ సాయిపల్లవికి ప్రతిష్ఠాత్మక అవార్డ్ దక్కింది.
తాజాగా జరిగిన 68 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌లో గార్గి చిత్రానికి గానూ తమిళంలో ఉత్తమ నటి గా సాయి పల్లవి పురస్కారం అందుకుంది.
అదే సమయంలో తెలుగులో విరాటపర్వం చిత్రానికి గాను క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ నటిగా అవార్డ్ దక్కించుకుందీ అందాల తార.
ఈ క్రమంలో రెండు భాషల్లోనూ ఒకే ఏడాదిలో ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్న హీరోయిన్‌గా సాయి పల్లవి గుర్తింపు పొందింది.
ఈ అవార్డుతో సౌత్ ఇండియాలో అతి తక్కువ కాలంలోనే ఆరు ఫిలిం ఫేర్ అవార్డులు దక్కించుకున్న హీరోయిన్‌గా సాయి పల్లవి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
ఇక్కడ క్లిక్ చేయండి..