22 September 2023

ఇది చాలా నీచమైన చర్య.. పెళ్లి ఫొటోలపై సాయి పల్లవి ఫైర్‌

తన సహజమైన నటనతో దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందుతోంది సాయి పల్లవి

గతేడాది విరాట పర్వం, గార్గి వంటి సినిమాల్లో నటించిందామె. అయితే ఆ తర్వాత మరే సినిమాలో కనిపించలేదు

చాలా గ్యాప్‌ తర్వాత శివకార్తికేయన్‌, నాగచైతన్యతో సినిమాలు చేసేందుకు రెడీ అయ్యిందీ న్యాచురల్‌ బ్యూటీ

కాగా సాయిపల్లవి పెళ్లి చేసుకుందంటూ గత రెండు రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఫొటోలు వైరలవుతున్నాయి

తాజాగా వీటిపై స్పందించింది సాయి పల్లవి. ఇలాంటి ఫొటోలతో ఒకరిని ఇబ్బంది పెట్టడం నీచమైన పనంటూ ఫైర్‌ అయ్యింది

కొందరు డబ్బుకోసం, నీచమైన ఉద్దేశాలతో ఇలాంటి పనులు చేస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందీ ట్యాలెంటెడ్‌ బ్యూటీ

22 September 2023