09 February 2025

సాయి పల్లవి ఆస్తులు తెలిస్తే షాకే.. మొత్తం ఎంత ఉన్నాయంటే..

Rajitha Chanti

Pic credit - Instagram

ప్రస్తుతం తండేల్ సినిమాతో మరో సూపర్ హిట్ అందుకుంది సాయి పల్లవి. ఇందులో సత్య పాత్రలో సహజ నటనతో అదరగొట్టేసింది. 

డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య హీరోగా నటించాడు. ఫిబ్రవరి 7న ఈ సినిమా విడుదలైంది. 

సాయి పల్లవి దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉందన్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఎన్నో చిత్రాల్లో నటించింది.

మరోవైపు ఇప్పుడు సాయి పల్లవి హిందీ చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తుంది. రణభీర్ కపూర్ నటిస్తోన్న రామయాణం సినిమాలో సీతగా నటిస్తుంది.

ఇదిలా ఉంటే. నివేదికల ప్రకారం సాయి పల్లవి ఆస్తులు రూ.50 కోట్లకు పైగా ఉన్నాయట. అమె సంపాదన ఎక్కువగా సినిమాల నుంచి వచ్చిందట. 

ఇక యాడ్స్ చేసేందుకు అసలు ఇష్టపడదు. ఒక్కో సినిమాకు రూ.3 కోట్లు పారితోషికం తీసుకుంటుంది. రామాయణం సినిమాకు రూ.6 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. 

సాయి పల్లవి దగ్గర ఆడి Q3, స్పోర్ట్స్ సెడాన్ మిత్సుబిషి లాన్సర్ Evo X ఉన్నాయి. 1992 మే 9న తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించింది. 

ఆమె జార్జియాలోని టిబిలిసి స్టేట్ మెడికల్ యూనివర్శిటీలో వైద్య విద్యను అభ్యసించారు. మొత్తం 24 నామినేషన్లలో 16 అవార్డులను గెలుచుకుంది.