25 November 2025

సినిమాలు తక్కువే.. సంపాదన ఎక్కువ.. సాయి పల్లవి ఆస్తులు ఎంతంటే..

Rajitha Chanti

Pic credit - Instagram

తండేల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సాయిపల్లవి.. ఇప్పుడు హిందీలో రామాయణ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంది.

తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న సాయిపల్లవికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.

ప్రస్తుతం ఆమె వయసు 33 సంవత్సరాలు. ఇప్పటికీ ప్రేమ, పెళ్లికి దూరంగా ఉంటూ కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటుంది ఈ బ్యూటీ.

నివేదికల ప్రకారం ఈ బ్యూటీ ఆస్తులు రూ.50 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. అలాగే ప్రస్తుతం ఒక్కో సినిమాకు ఆమె రూ.10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది.

దక్షిణాది చిత్రపరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. ఆమె స్వస్థలం ఊటీ సమీపంలోని కోటగిరి కాగా.. బడగ తెగకు చెందినవారు.

తండేల్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సాయిపల్లవికి కోయంబత్తూరులో అందమైన ఇల్లు ఉందట. అలాగే ఆమె వద్ద లగ్జరీ కార్లు సైతం ఉన్నాయట.

సాయిపల్లవి మిత్సుబిషి లాన్సర్ ఈవో ఎక్స్, ఆడి క్యూ3 వంటి రెండు విలాసవంతమైన కార్లు కూడా ఉన్నాయి. ఇటీవల అమరన్ సినిమాతో మరో సక్సెస్ అందుకుంది.

ప్రస్తుతం సాయిపల్లవి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంది. హిందీలో వరుస సినిమాలు చేస్తుంది.