TV9 Telugu

07 February 2024

లేదు., అలా అస్సలు చేయను అంటున్న సాయి పల్లవి.

సాయి పల్లవి ఈ చిన్నదాని అందానికి.. నటనకు ఫిదా కానీ ప్రేక్షకులు ఉండరు.

పక్కింటి అమ్మాయిలా ఉండే సాయి పల్లవి తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది.

గ్లామర్ పాత్రలను నో చెప్తూ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంది సాయి పల్లవి.

ఇటీవల కొంత కాలం సినిమాలకు గ్యాప్ తీసుకున్న సాయి పల్లవి తాజాగా అక్కినేని నాగ చైతన్యతో సినిమా చేస్తుంది.

గతంలో పుష్ప 2లో సాయి పల్లవి నటిస్తుందన్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. 

ఇక సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. స్పెషల్ సాంగ్స్ చేయడం పై క్లారిటీ ఇచ్చింది.

రంగస్థలంలో పూజాహెగ్డే, పుష్ప సినిమాలో సమంత లా స్పెషల్ సాంగ్ చేసే ఛాన్స్ వస్తే చేస్తారా అని యాంకర్ అడగ్గా..

నేను స్పెషల్ సాంగ్స్ లో అంత కంఫర్ట్ బుల్ గా ఉండను.. నేను స్పెషల్ సాంగ్స్ చేయను అని చెప్పేసింది సాయి పల్లవి..