సోల్జర్‌ను పెళ్లి చేసుకోవాల్సి వస్తే.. సాయి పల
్లలి ఆన్సర్ ఇదే..
30 October 2024
Basha Shek
గార్గి తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న సాయిపల్లవి ఇప్పుడు 'అమరన్' సినిమాతో సినీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది.
'మేజర్ ముకుంద్ వరదరాజన్' జీవిత చరిత్ర ఆధారంగా రాజ్ కుమార్ పెరియస్వామి ఈ సినిమాను తెరకెక్కించారు.
శివకార్తికేయన్ హీరోగా నటించిన ఈ సినిమా దీపావళి పండగ కానుకగా ఈ నెల 31వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలో అమరన్ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. హీరో, హీరోయిన్లు వరుసగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు.
ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన సాయి పల్లవి అమరన్ సినిమా, సైనికుల గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
'ఒక ఆర్మీ మెన్ జీవితంలో ఎలాంటి ఎమోషన్స్ ఉంటాయనేది నాకు అర్థమైంది. నటిస్తుంటేనే నాకు ఏడుపు వచ్చేసింది'..
'సోల్జర్ ను పెళ్లి చేసుకోవలసి వస్తే భయంగానే అనిపిస్తుంది. తప్పదు అంటే నేను మానసికంగా మరింత స్ట్రాంగ్ అవుతాను'.
'నీతో పాటు నేను కూడా వస్తాను అని చెబుతాను' అంటూ నవ్వేసింది సాయి పల్లవి. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.
ఇక్కడ క్లిక్ చేయండి..