కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చు.. రావడం మాత్రం పక్క..

15 September 2023

సాయి పల్లవి బ్యూటీ లేట్‌గా వచ్చిన లేటెస్ట్‌గా వస్తున్నారంటూ ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ఫిలిం సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది.

తెలుగులో చివరగా విరాటపర్వం సినిమా చేశారు పల్లవి. తమిళ సినిమా గార్గి కూడా తెలుగులో విడుదలైంది. ఆ తరువాత టాలీవుడ్‌ స్క్రీన్ మీద ఈ మలబారు బ్యూటీ కనిపించనే లేదు.

రీజన్స్ చెప్పకుండానే సడన్‌గా సైలెంట్ అయ్యారు. దీంతో సాయి పల్లవిని అవకాశాలు కరువయ్యాయా అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి.

రీసెంట్‌గా టాలీవుడ్‌లో బ్రేక్‌ రావటంపై క్లారిటీ ఇచ్చారు సాయి పల్లవి. అవకాశాలు రాకపోవటం వల్ల కాదు, కావాలనే తాను బ్రేక్ తీసుకున్నా అన్నారు.

ఆమె డైరెక్ట్‌గా రీజన్‌ చెప్పకపోయినా... రీసెంట్‌ టైమ్స్‌లో వచ్చిన వరుస ఫెయిల్యూర్సే ఈ నిర్ణయానికి కారణం అన్న టాక్ గట్టిగానే వినిపించింది.

ఈ బ్రేక్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు రెడీ అవుతూ.. ఆల్రెడీ తమిళ హీరో శివ కార్తికేయన్‌కు జోడి ఓ సినిమాకు సైన్ చేశారు. దీంతో పాటు ఓ బాలీవుడ్‌ మూవీలో కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్‌ ఖాన్ హీరోగా వస్తున్న సినిమాతో నార్త్ ఆడియన్స్‌ను పలకరించబోతున్నారు సాయి పల్లవి. హార్ట్ టచింగ్ లవ్‌ స్టోరీగా ఈ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

ప్రజెంట్ బాలీవుడ్ సినిమాలకు సౌత్‌ ఫ్లేవర్‌ బాగా కలిసొస్తుండటంతో సాయి పల్లవిని హీరోయిన్‌గా ఫైనల్‌ చేశారట మేకర్స్‌. మరి ఈ సినిమాలతో ఈ బ్యూటీ మరోసారి బిజీ అవుతారేమో చూడాలి.