02 January 2024

సన్నిధిలో సాయి పల్లవి

TV9 Telugu

స్టార్ హీరోయిన్, లేడీ పవర్ స్టార్ సాయి పల్లవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అందరు హీరోయిన్లు... బీచ్‌లో.. బికీనీల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ చేసుకుంటూ ఉంటే.. సాయి పల్లవి మాత్రం తనే రూటే సపరేట్ అంటున్నారు. 

తన చర్యలతో.. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తూ.. ఎంతైన ఈమె వేరబ్బా అనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నారు. 

తన సింపుల్ లుక్స్‌తో... యాటిట్యూడ్‌ లెస్‌ బిహేవియర్‌తో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ ట్యాగ్ వచ్చేలా చేసుకున్న సాయి పల్లవి.

తాజాగా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో కనిపించారు. నిండైన చీరలో ప్రత్యేకంగా కనిపించి అందర్నీ ఆకట్టుకున్నారు. 

అందరితో పాటు.. సత్య సాయి సమాధిని కొలుస్తూ.. న్యూ ఇయర్ గొప్పగా ఉండాలని ఆకాంక్షించారు. 

ఆ సాయి మనసారా స్మరించారు. ఆ వీడియోలతో ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నారు.