ఆ సపోర్ట్ గొప్పగా ఉందన్న సాయి ధరమ్ తేజ్.. థగ్‌ లైఫ్‌ ఫస్ట్ షెడ్యూల్‌..

TV9 Telugu

08 January 2024

తాజా జరిగిన ఓ ఇంటర్వ్యూలో విరూపాక్ష సినిమా గ్రాండ్ సక్సెస్‌ గురించి మాట్లాడారు మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌.

విరూపాక్ష సినిమా సక్సెస్‌ అయిందన్నదానికన్నా, కోమా నుంచి లేచి వచ్చిన తనను ప్రేక్షకులు ఆదరించిన తీరు అద్భుతంగా అనిపించిందని అన్నారు.

సినిమాల్లో చాలెంజింగ్‌ రోల్స్ చేయడానికి తానెప్పుడూ సిద్ధంగా ఉన్నానని చెప్పారు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్.

కేరాఫ్‌ కంచరపాళం ఫేమ్‌ కార్తిక్‌ రత్నం హీరోగా నటించిన సినిమా లింగోచా. అక్టోబర్‌లో థియేటర్లలో విడుదలైంది.

రొమాంటిక్‌ డ్రామాగా మెప్పించిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కి డేట్‌ ఫిక్స్ అయింది. జనవరి 13 నుంచి ఆహా లో అందుబాటులోకి రానుంది లింగోచా.

ఉలగనయగన్ కమల్‌హాసన్‌ హీరోగా నటిస్తున్న సినిమా థగ్‌ లైఫ్‌. ఈ సినిమాకి మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ షెడ్యూల్‌ ఈ ఏడాది జనవరి 18 నుంచి మొదలు కానున్నట్లు ప్రకటించారు మూవీ మేకర్స్.

చెన్నైలోని ఓ కాలేజీలో షూటింగ్‌ ప్రారంభించనున్నారు. కమల్‌హాసన్‌తో పాటు కీలక పాత్రధారులందరూ ఈ షెడ్యూల్‌కి హాజరవుతారు.