అందంలో చందమామ చెల్లెలిలా ఆకట్టుకుంటున్న సదా..
08 October 2023
2002లో జయం సినిమాలో నితిన్ పక్కన హీరోయిన్ గా సినీ అరంగేట్రం చేసింది సదా. ఇందులో నటనకి ఫిల్మ్ ఫేర్ నుంచి ఉత్తమ నటి అవార్డు పొందింది.
సదా అని స్క్రీన్ నేమ్ తో పిలుస్తున్న ఈ బ్యూటీ అసలు పేరు సదాఫ్ మొహమ్మద్ సయ్యద్. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో ఎక్కువగా నటించింది.
తర్వాత తెలుగులో ప్రాణం, జూనియర్ ఎన్టీఆర్ నాగ చిత్రాల్లో కథానాయకిగా కనిపించింది. ఈ రెండు ప్రేక్షకులను నిరాశపరిచాయి.
2003 తెలుగు జయంకి రీమేక్ గా వచ్చిన తమిళ జయం సినిమాలోను హీరోయిన్ గా నటించింది. ఈ మూవీతో తమిళ ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ భామ.
తర్వాత 2004లో మంచు మనోజ్ దొంగ దొంగది చిత్రంతో ప్రేక్షకుల మనుసు దోచేసింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది.
దీని తర్వాత వరుస సినిమాలతో తెలుగులో స్టార్ డమ్ తెచ్చికుంది ఈ వయ్యారి భామ. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది.
సినిమాలు మాత్రమే కాదు ప్రముఖ తెలుగు డ్యాన్స్ రియాల్టీ షో ఢీలో కొన్ని సీజన్స్ కి జడ్జ్ గా బుల్లితెరపై సందడి చేసింది ఈ వయ్యారి.
ఇటీవల తెలుగులో తేజ దర్శకత్వంలో వచ్చిన అహింస అనే చిత్రంలో కీలక పాత్రలో కనిపించింది. ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి