బ్లాక్ శారీలో అందానికి చిరునామాలా మెరిసిపోతున్న సార్య..
23 October 2023
5 సెప్టెంబర్ 2001న ఆంధ్ర ప్రదేశ్ లో గుంటూరులో జన్మించింది వయ్యారి భామ సార్య లక్ష్మణ్. ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యూయేషన్ పూర్తి చేసింది.
మోడలింగ్ తో తన కెరీర్ మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ హనీ సార్య సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ తెచ్చుకుంది.
నచ్చినావురో ఫోక్ సాంగ్ లో నటనతో పాపులరై యూత్ లో క్రేజ్ సంపాదించుకుంది. ఈ సాంగ్ తో కుర్రాళ్ల మనసు దోచేసింది.
అద్భుతమైన, ఆకర్షణీయమైన రూపం, టాలెంట్ కారణంగా వివిధ మోడలింగ్ ఆఫర్‌లను అందుకుంది వయ్యారి భామ సార్య లక్ష్మణ్.
మోడలింగ్ రంగంలో నటించడం ద్వారా తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుని నటనవైపుగా తన దృష్టి సారించింది ఈ అందాల తార.
2023లో మేమ్ ఫేమస్ సినిమాతో వెండితెరకు పరిచయం అయింది ఈ బ్యూటీ. తొలి చిత్రంతోనే తన అందం నటనతో ఆకట్టుకుంది ఈ భామ.
తాజాగా సోషల్ మీడియా బ్లాక్ శారీలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది ఈ వయ్యారి. ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు తెగ లైక్స్ కొడుతున్నారు.
మేమ్ ఫేమస్ తో హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాత హీరోయిన్ గా నటించబోయే సినిమా గురించి ఎలాంటి ప్రకటన లేదు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి