ముత్యానికి ముస్తాబు చేస్తే ఈ వయ్యారిలానే ఉంటుందేమో..
27 November 2023
12 సెప్టెంబర్ 1997 తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఓ హిందూ కుటుంబంలో జన్మించింది అందాల భామ శాన్వి మేఘన.
ఆమె తండ్రి వంశీ కిషోర్ వ్యాపారవేత్త కాగా, తల్లి పద్మ మందుముల గృహిణి. వంశీ పూజిత్ అనే సోదరుడు ఉన్నాడు.
2019లో ‘బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో రంగ ప్రవేశం చేసింది ఈ వయ్యారి భామ.
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' (2021), 'పుష్పక విమానం' (2021)తో సహా అనేక ఇతర చిత్రాలలో కనిపించింది ఈ భామ.
2021లో తెలుగు నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘పిట్ట కథలు’తో OTTలో అరంగేట్రం చేసింది. ఇందులో ఆమె ‘రాముల’ పాత్రను పోషించింది.
ఈ వయ్యారి జంతు ప్రేమికురాలు. హీరో అనే పెంపుడు కుక్కను ఈమె దగ్గర ఉంది. డ్యాన్స్ కూడా ఇష్టం ఈ ముద్దుగుమ్మకి.
ఈ భామకి బైక్‌లంటే చాలా ఇష్టం, ముఖ్యంగా రాయల్ ఎన్‌ఫీల్డ్. తన తీరిక సమయంలో పెయింట్ చేయడానికి ఇష్టపడుతుంది.
ఇటీవల సంగీత్ శోభన్ కి జోడిగా ప్రేమ విమానం అనే చిత్రంలో కథానాయకిగా ఆకట్టుకుంది. ఈ మోవి జీ5లో విడుదలైంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి