స్వర్గంలో కూడా లేదు ఈ కోమలి వంటి అందం.. రుక్సార్ పిక్స్ వైరల్..
TV9 Telugu
31 July 2024
రుక్సార్ ధిల్లన్.. ఈ అమ్మడు ఆకతాయి అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
ఆ తర్వాత నాని హీరోగా నటించిన కృష్ణార్జున యుద్ధం సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఈ సినిమాలో తన నటనతో పాటు తన అందంతోనూ ఆకట్టుకుంది ఈ బ్యూటీ.
తర్వాత అల్లు శిరీష్ హీరోగా నటించిన ఏబీసీడీ అనే సినిమాలో చేసింది. ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
విశ్వక్ సేన్ హీరోగా నటించిన అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాతో హిట్ అందుకుంది. దీనిలో కూడా రుక్సార్ ధిల్లన్ సెకండ్ హీరోయిన్ గా చేసింది.
ఇటీవల అక్కినేని నాగార్జున నా సామిరంగ సినిమాలో రాజ్ తరుణ్ సరసన నటించి ప్రేక్షకులను అలరించింది ఈ ముద్దుగుమ్మ.
ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తిచేసిన రుక్సార్.. ఆ తర్వాత నటనపై ఆసక్తితో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది.
తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ ఫోటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.
ఈ ఫోటోలను చుసిన కొంతమంది నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా ఈ పిక్స్ ఓ లుక్కెయ్యండి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి